Saturday, December 29, 2018

సమస్యా పూరణం - దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

కంది శంకరయ్య గారి ‘శంకరాభరణం’ బ్లాగ్ లో ఈరోజు ఇచ్చిన సమస్య
దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

తండ్రి చూస్తే గొప్ప పండితుడు; కొడుకుకి చదువు అబ్బలేదు. ఇది ఎలా ఉంది అంటే దొండ తీగకుఁ గాసెను బెండ కాయ’ వలె ఉంది అని తేటగీతి లో సమస్య పూరించాను


తండ్రిచూడగపండితుడుండుగొప్ప
కొడుకుచూడగ పామరుడుండులెస్స
పండితతనయుడుపరమశుంఠరీతి 
దొండ తీగకుఁ గాసెను బెండ కాయ

No comments:

Post a Comment